సాలూరు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా 1వ తేదీన ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించి, వారి నమ్మకాన్ని గెలుచుకోవాలని సూచించారు. రూ. 20 కోట్లతో 40 హెల్త్ సెంటర్లు మంజూరయ్యాయని, మై టీడీపీ యాప్‌ను వినియోగించాలని నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో మండల, యూనిట్ నాయకులు పాల్గొన్నారు.