సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

617చూసినవారు
పాచిపెంట మండల సమాఖ్య సమావేశంలో ట్రైనీ ఎస్సై భాస్కరరావు సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గురువారం సూచించారు. వాట్సప్‌లో వచ్చే అనుమానాస్పద లింకులు, తెలియని యాప్‌లను తెరవద్దని, తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించరాదని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం రూపొందించిన శక్తి యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం శ్రీరాములు, మహిళా పోలీస్ చిన్నమ్మలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్