సాలూరు మండలంలో మంగళవారం సాయంత్రం, రాత్రి వీచిన బలమైన ఈదురుగాలులు, వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాలూరు-మక్కువ, సాలూరు-దండిగాం రహదారులపై చెట్లు విరిగిపడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. బొడ్డవలస వద్ద రూరల్ ఎస్ఐ రవీంద్ర రాజు జేసీబీ సహాయంతో చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. తాడిలోవ వద్ద కూడా చెట్లు అడ్డంగా పడటంతో వాహనాలు నిలిచిపోయాయి, స్థానికులు వాటిని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. గాలుల ధాటికి మామిడి కాయలు నేలరాలటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.