చెరువులో పడి మహిళ మృతి

864చూసినవారు
శృంగవరపుకోటలోని దారగంగమ్మ గుడి సమీపంలో ఉన్న దగ్గు చెరువులో పడి కోటదేవి అనే మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువు సమీపంలోనే నివాసం ఉంటున్న కోట గోపి భార్య దేవి బహిర్భూమికి వెళ్లేందుకు చెరువు గట్టుపైకి వెళ్లగా కాలుజారి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయినట్లు తెలిపారు. అటుగా వెళ్తున్న కొంతమంది గమనించి సమాచారం ఇవ్వగా, స్థానికులు అక్కడికి చేరుకుని చూసేసరికి ఆమె మృతి చెందింది.

సంబంధిత పోస్ట్