సాలూరు దాసరివీధి సీతారామ కల్యాణ మండపంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సఖి సురక్ష హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళల ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యమని, రక్తపోటు, షుగర్, హీమోగ్లోబిన్, స్తన, గర్భాశయ క్యాన్సర్ వంటి పరీక్షలు నిర్వహించబడ్డాయని తెలిపారు. గ్రామీణ, గిరిజన మహిళలకు సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, మహిళల ఆర్థిక, శారీరక, మానసిక ఆరోగ్యం సమాజ అభివృద్ధికి కీలకమని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్యులు, మహిళా సంఘాలు పాల్గొన్నారు.