గురువారం వేపాడ మండలం కొండగంగుపూడి గ్రామ శివారులో అకస్మాత్తుగా కురిసిన వర్షంలో పిడుగుపాటు సంభవించి తొమ్మిది మేకలు మృతి చెందాయి. రామస్వామిపేటకు చెందిన పశుపాలకుడు పత్రి శ్రీను తన మేకలను మేతకు తీసుకెళ్లినప్పుడు ఈ విషాద ఘటన జరిగింది. ఈ సంఘటనతో తీవ్రంగా నష్టపోయిన శ్రీను, ప్రభుత్వం ఆదుకుని పరిహారం అందించాలని అధికారులను వేడుకున్నాడు.