ఎస్.కోట పట్టణంలో ఆర్కే ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆ జీవిక మిషన్ గ్రామీణ్ పథకంపై ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ పథకం గ్రామీణులకు ఉపాధి, జీవనోపాధి కల్పించి, గ్రామాభివృద్ధికి దోహదపడుతుందని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పార్లమెంట్లో చట్టం చేయబడిందని జిల్లా కోఆర్డినేటర్ డి. సూర్యారావు తెలిపారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని, గ్రామస్థాయిలో 200 సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.