తమ్ముడి వివాహం రోజే విద్యుత్ షాక్ తో అన్న మృతి

2చూసినవారు
తమ్ముడి వివాహం రోజే విద్యుత్ షాక్ తో అన్న మృతి
విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మిర్తివలసలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తమ్ముడి వివాహం జరుగుతున్న రోజున, మేడపై దుస్తులు ఆరేస్తుండగా పెళ్లి అలంకరణకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి సతీశ్ (32) అనే యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. బంధువులు అతన్ని శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుండగా ఏడాది క్రితం వివాహమైంది. పెళ్లింట తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

సంబంధిత పోస్ట్