లక్కవరపుకోట మండలంలోని రంగాపురం, జమ్మాదేవిపేట గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. నిరుపేదలకు అండగా నిలవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.