పర్యాటకులను ఆకట్టుకునేలా హెలికాప్టర్ రెస్టారెంట్

2చూసినవారు
అరకు వెళ్లే రహదారిలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు హెలికాప్టర్ ఆకారంలో రెస్టారెంట్ ను నిర్మిస్తున్నారు. శృంగవరపుకోట మండలం బొడ్డవర సమీపంలో ఈ ప్రత్యేక నమూనాను రెస్టారెంట్ నిర్వాహకుడు ఏర్పాటు చేస్తున్నారు. ఈ హెలికాప్టర్ తరహా రెస్టారెంట్‌లో ఒకేసారి 16 మంది కూర్చొని భోజనం చేసే సదుపాయం కల్పిస్తున్నట్లు నిర్వాహకుడు తెలిపారు. అరకు ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ప్రస్తుతం ఈ నిర్మాణం పనులు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్