పెట్రోల్ బంక్‌పై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

723చూసినవారు
పెట్రోల్ బంక్‌పై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
శృంగవరపుకోట మండలం గంగుబూడి గ్రామంలోని పెట్రోల్ బంకులో అక్రమ విక్రయాలపై సోమవారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పెట్రోల్ నాణ్యత, నిల్వలను పరిశీలించి, వాహనదారులకు మాత్రమే ఇంధనం విక్రయించాలని, బాటిల్స్‌లో అమ్మకాలను నిషేధించాలని ఆదేశించారు. ఈ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్