ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం శృంగవరపుకోటలోని టిడిపి కార్యాలయంలో మాట్లాడుతూ, ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలకు అంకితభావంతో మరింత సేవ చేసేందుకు భగవంతుడు తనకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరారు.