ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలను
వైసీపీ శ్రేణులు కొత్తవలస మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎల్కోట ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు తదితర వైసిపి నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస రావు ను దుస్సాలువాతో సత్కరించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.