కొత్తవలస సీఐ టి. వి. విజయకుమార్ మంగళవారం మూడు రోడ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలను స్వయంగా పరిశీలించారు. విశాఖ–అరకు ప్రధాన రహదారిలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ నిర్వహణపై వారికి దిశానిర్దేశం చేశారు. విజయనగరం, విశాఖ రహదారులను పరిశీలించి, త్వరలో సమగ్ర ట్రాఫిక్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తానని తెలిపారు. ఈ పరిశీలనలో సిబ్బంది పాల్గొన్నారు.