కొత్తవలస పట్టణ కేంద్రంలో సోమవారం
ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ సమయంలో సర్వర్ సమస్య తలెత్తింది. ఉదయం నుంచే పింఛన్ల కోసం వచ్చిన లబ్ధిదారులు సర్వర్ మొరాయించడంతో ఇబ్బందులు పడ్డారు. పంపిణీ ప్రక్రియ నిలిచిపోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేశారు. కొంతసేపటి తర్వాత సాంకేతిక సమస్య పరిష్కారమై సర్వర్ పనిచేయడంతో పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ కృష్ణ పింఛన్లు పంపిణీ చేయడంతో లబ్ధిదారులు ఊరట చెందారు.