డ్రగ్స్ ప్రభావం నుంచి యువతను రక్షించి, సమాజాన్ని మత్తు రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని కొత్తవలస సీఐ షణ్ముఖరావు పిలుపునిచ్చారు. ఈ లక్ష్యంతో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా కొత్తవలసలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు.