శృంగవరపుకోట మండలం రాజీపేటలోని గాయత్రీ తపస్వి ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రతి ఏడాది కార్తీక్ పౌర్ణమి సందర్భంగా వెలిగించే ఆకాశ అఖండ దీప ప్రజ్వలనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 40 అడుగుల ఎత్తులో, 300 కేజీల ఆవు నెయ్యి, 300 మీటర్ల వత్తి, 9 కేజీల కర్పూరంతో ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీప ప్రజ్వలన దర్శనానికి 10,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసి, వారికి మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.