శృంగవరపుకోట మండలం రెల్లీ గవీరమ్మపేటలో నెలకొన్న విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను విజయవాడలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆర్‌జీ పేట ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ అంతరాయాలు, మౌలిక సదుపాయాల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు మంత్రిని శాలువాతో సత్కరించారు.