ఎస్ కోట: ప్రత్యేక పంచాయతీ కావాలని నిరసన

83చూసినవారు
ఎస్ కోట: ప్రత్యేక పంచాయతీ కావాలని నిరసన
ఎస్ కోట పంచాయతీ పరిధిలోని సీతంపేట గ్రామానికి చెందిన ప్రజలు తమ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీ గా పరిగణించాలని కోరుతూ స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఎస్ కోట పంచాయతీలో విలీనమై ఉన్న తమ గ్రామంలో పదివేల మంది జనాభా ఉన్నట్లు తెలిపారు. అయినప్పటికీ తమ గ్రామం అభివృద్ధి చెందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా పరిగణించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్