తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తిక్కాన చినదేముడు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆయన శృంగవరపుకోట నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి అభివృద్ధికి కీలకపాత్ర పోషించారు. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చినదేముడు సర్పంచ్‌గా, వైస్ ఎంపిపిగా, కొత్తవలస మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, తెలుగు రైతు సంఘం అధ్యక్షుడిగా ప్రజలకు సేవలు అందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన మరణంతో టీడీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది.