ఎస్.కోట మండలం సంతగవిరమ్మపేటకు చెందిన గర్భిణి సీహెచ్ గంగాభవానీ, ప్రసవం కోసం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో చేరారు. 25న రాత్రి సిజేరియన్ జరిగిన తర్వాత, ఆమె తన రెండు తులాల బంగారు పుస్తెలతాడును తల్లికి ఇచ్చారు. తల్లి ఆ పుస్తెలతాడును హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టి, తలకింద పెట్టుకుని నిద్రపోయారు. ఉదయం లేచి చూసేసరికి బ్యాగ్‌లో పుస్తెలతాడు కనిపించలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీఐ నారాయణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది.