శృంగవరపుకోట మండల కేంద్రంలో ఇటీవల తుఫాన్ వల్ల నష్టపోయిన కుటుంబాలకు స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నగదు పంపిణీ చేశారు. తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తహసిల్దార్ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.