కొత్తవలస మండలం తుమ్మికాపల్లి పంచాయతీ పరిధిలోని జగన్నాథం లేఅవుట్ సాయిసంపత్ అపార్ట్మెంట్‌లో వానపల్లి సోమేశ్వరరావు (36) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రాజపాత్రునిపాలెం గ్రామానికి చెందిన సోమేశ్వరరావు, మంగళవారం ఉదయం బస్ పాస్ కోసం డబ్బులు తీసుకుని వెళ్లి రాత్రి తిరిగి రాలేదు. అదే రాత్రి కంచరాన అశోక్‌కుమార్ ఇంట్లో బస చేశాడు. ఉదయం లేపినా లేవకపోవడంతో మృతిచెందినట్లు గుర్తించారు. పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం కోసం శృంగవరపుకోట ఆస్పత్రికి తరలించారు.