కొత్తవలస పట్టణ శివారులోని ఎన్. జీ. వో. కాలనీలో సోమవారం అర్ధరాత్రి ఒక ఆర్టీసీ డ్రైవర్ ఇంట్లో దొంగతనం జరిగింది. పండగ కోసం ఆదివారం వియ్యంపేట వెళ్లిన డ్రైవర్, మంగళవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి, టీవీ కబోర్డ్‌లో ఉన్న రెండు తులాల బంగారు చైన్, 35 వేల రూపాయల నగదు అపహరణకు గురైనట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.