మంగళవారం వేపాడ మండలం బొద్దాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ-అరకు ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. వర్షం కురుస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వల్లంపూడి ఎస్సై సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాద తీవ్రతకు బైకులపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.