వేపాడ మండలంలో గురుపౌర్ణమి సందర్భంగా పలు గ్రామాల్లో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వల్లంపూడిలో సాయి మహిళా సంఘం ఆధ్వర్యంలో పూజలు జరిపారు. పాటూరువేపాడ, వావిలపాడు, కొండగుళ్లు తదితర గ్రామాల్లో పాలాభిషేకాలు, అష్టోత్తర పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.