కాలుజారి చెరువులో పడిన మహిళ మృతి

3చూసినవారు
కాలుజారి చెరువులో పడిన మహిళ మృతి
శృంగవరపుకోట మండలంలో దారగంగమ్మ గుడి సమీపంలోని దగ్గు చెరువులో పడి కోటదేవి అనే మహిళ మృతి చెందింది. చెరువు వద్దకు వెళ్లిన సమయంలో కాలుజారి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. అటుగా వెళ్తున్న వారు గమనించి సమాచారం ఇవ్వగా గ్రామస్థులు చేరుకుని పరిశీలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్