
ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. పలువురు రోగులు మృతి
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒక ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో పలువురు రోగులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వారు 20 మంది రోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




