
గోవా అగ్నిప్రమాదం.. వెలుగులోకి మరో వీడియో
గోవాలోని ఓ నైట్ క్లబ్ లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా 23 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. నైట్ క్లబ్ లో డ్యాన్సర్లతో ప్రోగ్రామ్ కొనసాగుతుండగానే పైన రూఫ్ లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ తో నిప్పు రాజుకుని నిమిషాల వ్యవధిలోనే క్లబ్ మొత్తం మంటలు వ్యాపించి పెను ప్రమాదం జరిగింది.




