జిల్లాలో నేరాల నియంత్రణకు డ్రోన్లను వినియోగిస్తున్నట్లు ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. శివారు, రద్దీ ప్రాంతాల్లో నిఘా పెట్టి ఈవ్ టీజింగ్, ఓపెన్ డ్రింకింగ్, పేకాటలను అరికడుతున్నట్లు చెప్పారు. గత 6 నెలల్లో డ్రోన్ల సాయంతో ఓపెన్ డ్రింకింగ్ చేసిన 180 మంది, పేకాట-కోడిపందాల్లో పాల్గొన్న 51 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పండగలు, జాతర్లలో నిఘా పెట్టేందుకు డ్రోన్లు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.