అరుదైన వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు, సునీల గజపతి రాజు దంపతులు ఆర్థిక సహాయం అందించారు. కోరుకొండ ప్రాంతానికి చెందిన బేబీ కృష్ణ అనే చిన్నారి ఎస్‌ఎంఏ టైప్-1 వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుసుకుని, ఆమె చికిత్స కోసం రూ. 50 వేల విరాళం అందజేశారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి సహాయానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.