డీజిల్ కోసం ఆటో డ్రైవర్ల ఆందోళన

754చూసినవారు
విజయనగరం జిల్లాలో డీజిల్ కొరతతో ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ లేకపోతే రోజువారీ కిరాయితో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమవుతుందని, ఇంకెన్ని రోజులు ఈ పరిస్థితి కొనసాగుతుందో తెలియక ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ బంకుల వద్ద ఆటోలు బారులు తీరుతున్నాయి. ఈ దుస్థితిపై డ్రైవర్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్