భోగాపురం మండలంలోని నారుపేట గ్రామానికి చెందిన అట్టాడ పుష్ప (22) మనస్పర్థల కారణంగా గురువారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను కుటుంబసభ్యులు తగరపువలసలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ప్రియుడు సాయి వేధింపులే కారణమని తండ్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.