శనివారం భోగాపురం మండలంలోని అప్పన్నపేట వద్ద రోడ్డు ప్రమాదంలో డి.గోవిందరావు (34) అనే యువకుడు మృతి చెందాడు. ముంజేరు నుంచి భోగాపురం వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా వ్యాన్ ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య కొండమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వి. పాపారావు తెలిపారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.