కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఉన్న దేవాలయాలు, వాటిలో ఏడాదిపాటు జరిగే ఉత్సవాల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన స్పందిస్తూ, ఆయా ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల సంఖ్య, గతంలో చోటుచేసుకున్న ప్రమాదాలు, భద్రతా ఏర్పాట్ల వంటి అంశాలపై సమగ్ర సర్వే చేసి నివేదిక సమర్పించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.