విజయనగరం జిల్లాలో ఇంధన కొరతపై కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ, అధికారులతో తప్పుడు ప్రకటనలు ఇప్పిస్తోందని జిల్లా
కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆరోపించారు. మంగళవారం
కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో అనేక పెట్రోల్ బంకులు 'నో స్టాక్' బోర్డులతో కనిపిస్తున్నాయని, అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సానమనేటి శ్రీనివాస్, ఐశ్వర్య, షరీఫ్, సమీర్, అనిల్ పాల్గొన్నారు.