విజయనగరం జిల్లాలో వాతావరణంలో ఆకస్మిక మార్పు చోటుచేసుకుంది. వాయుగుండం ప్రభావంతో బొబ్బిలి, రామభద్రపురం, రాజాం, మెరకముడిదాం మండలాల్లో తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఈ వర్షం వల్ల ఎండల తీవ్రత తగ్గి ప్రజలకు ఉపశమనం లభించింది. చెరకు, కూరగాయల పంటలకు ఈ వర్షం మేలు చేస్తుందని రైతులు భావిస్తున్నారు. వాతావరణం చల్లబడటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.