మొంథా తుఫాను కారణంగా విజయనగరం జిల్లాలో 665.69 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ జేడీ రామారావు తెలిపారు. ఇందులో 644.03 హెక్టార్ల వరి, 6.40 హెక్టార్ల మొక్కజొన్న, 4.93 హెక్టార్ల పత్తి, 1.01 హెక్టార్ల మినుముల పంటలు నష్టపోయినట్లు ఆయన వెల్లడించారు. నష్టపోయిన రైతుల వివరాలను ఏపీ ఏఐఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు.