కొత్తవలస మండలం అర్ధానపాలెం మోడల్ స్కూల్‌కు వెళ్లే ప్రారంభం వద్ద మధుములో మృతదేహం కలకలం రేపింది. కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామానికి చెందిన ఎస్కే మస్తాన్(50) 3 రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం మోడల్ స్కూల్ విద్యార్థులు చూడటంతో విషయం బయటకు వచ్చింది. మృతికి కారణాలు తెలియటం లేదని భార్య ఎస్‌కే అలీమా వాపోయారు.