డెంకాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో విధుల్లో ఉండాల్సిన డాక్టర్ గైర్హాజరు కావడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత డాక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఫోన్‌లో ఆదేశించారు. వార్డులో బెడ్స్‌తోపాటు మెడిసిన్ బాక్సులు నిల్వ ఉంచడంపై అసహనం వ్యక్తం చేశారు.