తాటిపూడి నీటిపై అపోహలు నమ్మొద్దు

70చూసినవారు
తాటిపూడి నీటిపై అపోహలు నమ్మొద్దు
తాటిపూడి రిజర్వాయరు నీటి విషయంలో రైతులు గానీ, ప్రజలు గానీ ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎంఎస్‌ఎంఇ, సెర్ఫ్‌, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఉద్దేశ పూర్వకంగా కొంతమంది రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జిందాల్‌ భూములను ఎంఎస్‌ఎంఇ పార్కు కోసం కేటాయించిన మాట వాస్తవమేనని, అక్కడ పరిశ్రమలు కూడా వస్తాయని, తద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. ఇంకా అక్కడ ఎలాంటి పరిశ్రమలు వస్తాయి? వాటికి ఎంతమేర నీటి అవసరాలు ఉంటాయనేది ఇంకా తేలాల్సి ఉందన్నారు

సంబంధిత పోస్ట్