గోడ కూలి వృద్ధురాలి దుర్మరణం

0చూసినవారు
గోడ కూలి వృద్ధురాలి దుర్మరణం
విజయనగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం, గోకపేటలో నివాసం ఉంటున్న ఆర్. సన్యాసమ్మ (74) అనే వృద్ధురాలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు నడిచి వెళ్తుండగా, ఇటీవల కురిసిన వర్షాలకు నాని బలహీనపడిన పెంకిటిల్లు గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో వృద్ధురాలు గోడ కింద ఇరుక్కుపోయి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో పట్టణ ఎస్సై లక్ష్మునాయుడు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్