విజయనగరం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ రైతు బజార్ పక్కన ఉన్న మూడు షాపుల్లో బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. శివ అనే వ్యక్తి జ్యూస్ షాపు, నాయుడు, మధుల ఫ్రూట్ షాప్‌లు, గాయత్రి స్వీట్ షాప్‌లు మంటల్లో దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.