విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పేరాపురం వద్ద జాతీయ రహదారి-16పై సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు రోడ్డుపై ఉన్న ఇద్దరు పాదచారులను ఢీకొని, ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో విశాఖకు చెందిన ఇరిగేషన్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గాయపడిన వ్యక్తి బొబ్బిలి వాసిగా గుర్తించారు. మృతుల్లో మరో ఇద్దరు రోడ్డుపై ఉన్న వారు కాగా మరొకరు కారులో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.