
బుద్ధ పూర్ణిమ వేడుకల్లో రోబో సన్యాసి 'గాబీ'.. వీడియో వైరల్
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని జోగ్యేసా ఆలయంలో బుద్ధ పూర్ణిమ వేడుకల్లో 'గాబీ' అనే హ్యూమనాయిడ్ రోబో సన్యాసి అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 130 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న ఈ రోబో, సన్యాసుల వస్త్రాలు ధరించి, 108 పూసల జపమాలతో ప్రార్థనల్లో పాల్గొంది. 'నువ్వు బౌద్ధమతానికి అంకితమవుతావా?' అని అడగ్గా, 'అవును, అంకితమవుతాను' అని రోబో బదులిచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.




