విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తుమ్మికాపల్లికి చెందిన కే. గణపతిరావు డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. కొత్తవలస జడ్పీ హైస్కూల్లో 1984-85లో పదో తరగతి చదివిన ఆయన కష్టపడి చదివి తొలుత డీసీటీవోగా ఉద్యోగంలో చేరారు. అనంతరం రెవెన్యూ శాఖలో ప్రొబేషనరీ డిప్యూటీ తహశీల్దార్‌గా, విశాఖపట్నం కలెక్టరేట్‌లో ల్యాండ్ రిఫార్మ్స్ స్పెషల్ తహశీల్దార్‌గా సేవలందించారు. పదోన్నతి పొందిన గణపతిరావును పలువురు అభినందించారు.