గుర్ల మండలంలోని కెల్ల సొసైటీ వద్ద శనివారం యూరియా పంపిణీ జరిగింది. తెల్లవారుజామున 6 గంటల నుంచే రైతులు, మహిళలు కూడా మంచును లెక్కచేయకుండా యూరియా బస్తాల కోసం క్యూలో నిల్చున్నారు. కొంతమందికే యూరియా అందుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. అందరికీ యూరియా పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.