చీపురుపల్లి రైల్వే ఓవర్‌బ్రిడ్జిని ఈ నెల 10వ తేదీన రైల్వే శాఖ ప్రారంభించనుందని బిజెపి కో కన్వీనర్ మన్నెపూరి శ్రీనివాసరావు గురువారం తెలిపారు. బ్రిడ్జి నిర్మాణానికి సహకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలకు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వంతెనతో పాలకొండ-విజయనగరం మధ్య ప్రయాణం సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు.