హెడ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు

0చూసినవారు
హెడ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు
తెర్లాం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఎం. సురేష్ కుమార్ను ఎస్పీ దామోదర్ సస్పెండ్ చేశారు. మహిళా ఉద్యోగులు, అధికారులతో అసభ్యకరంగా ప్రవర్తించడం, చరవాణిలో అసభ్యకర సందేశాలు పంపడం, మొదటి భార్య ఉండగానే మరో మహిళను పెళ్లి చేసుకుని మోసం చేయడం వంటి ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు. రెండో పట్టణ సీఐ టి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన విచారణలో ఆరోపణలు రుజువైనట్లు ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్