విజయనగరం జిల్లాలో రేపు (శనివారం) తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు అత్యవసరం లేకుండా బయటకు రావద్దని విపత్తు నిర్వహణ సంస్థ అధికారి సూచించారు. శరీరాన్ని చల్లగా ఉంచడానికి నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ తీసుకోవాలని, చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.